అమరావతి: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ పై నటుడు ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డాడు. ఓ ఇంటర్యూలో తాజా రాజకీయాలు, జాతీయ అవార్డుల గురించి ఆయన స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడేవారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి గురించి అంతగా పట్టించుకోవడంలేదని చురకలంటించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. సనాతన ధర్మానికి తాను ఎప్పుడు వ్యతిరేకంగా లేను అని, తిరుమల లడ్డూ అనేది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో చాలా జాగ్రత్త మాట్లాడాలని, రకరకాలుగా మాట్లాడుకోవడానికి సినిమా కాదు అని చురకలంటించారు. లడ్డూ తయారీలో నిజంగా కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి లడ్డూ విషయంలో ప్రకాశ్ రాజ్ ట్విట్‌పై పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే.
అప్పుడు స్పందించారు… ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు పవన్: ప్రకాశ్ రాజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -