Thursday, January 16, 2025

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!

- Advertisement -
- Advertisement -

పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ సంధించిన మరో ట్వీట్

హైదరాబాద్: తిరుపతి లడ్డు విషయంలో రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ట్విటర్ వేదికగా కూడా రచ్చ కొనసాగుతోంది. ‘‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!…కదా?..ఇక చాలు…ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి…’’అంటూ హితవు పలికారు. దీనికి  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో మరి?…

కల్తీ లడ్డు రగడ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కూడా దీటుగానే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ కు నిజంగానే పవన్ కళ్యాణ్ అంటే పడదా? లేక ‘జస్ట్ ఆస్కింగ్’ చందంగా కథ నడుపుతున్నారా? అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ కు, చిరంజీవి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ రాజకీయ పరంగా ‘నువ్వు నువ్వే…నేను నేనే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News