దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అయనే తన ట్వీటర్ ద్వారా వెల్లడించాడు. అయితే, ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకున్నది వేరే అమ్మాయిని కాదు.. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తన కొడుకు కోరిక మేరకు మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. ఆగస్టు 24న ప్రకాశ్ రాజ్, పోనీ వర్మ దంపతుల పెళ్లి రోజు. ఈ సందర్భంగా కొడుకు వేదాంత్ కోసం మరోసారి తన భార్య పోనీ వర్మను ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా వివాహానికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేము మళ్లీ పెళ్లి చేసుకున్నాం’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలితకుమారి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు జన్మించారు. అయితే, అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు. తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి 2010లో ప్రకాశ్ పోనిని వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు వేదాంత్ జన్మించాడు.
We got married again tonight..because our son #vedhant wanted to witness it 😍😍😍. Family moments #bliss pic.twitter.com/Vl29VlDQb4
— Prakash Raj (@prakashraaj) August 24, 2021
Prakash Raj married wife again for his Son