Friday, November 22, 2024

మేము రాజీనామా చేస్తున్నాం: ప్రకాశ్ రాజ్ ప్యానెల్

- Advertisement -
- Advertisement -

Prakash raj panel members resign

హైదరాబాద్: ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరమని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తెలిపారు.  అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుందన్నారు.  గత రెండేళ్లలో నరేష్ “మా” అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే ముందు ఉండి “మా” కోసం ఏ పని జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారని గుర్తు చేశారు.

ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.  ఈసారి జరిగిన ఎన్నికలలో విష్ణు ప్యానల్ నుంచి కొందరు, ప్రకాష్ రాజ్  ప్యానెల్ నుంచి కొందరు గెలవడం జరిగిందని, మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందని, సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేమన్నారు. అందుకని “మా” సంస్థని విష్ణు ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము “మా” పదవులకు మనసా వాచా కర్మణా రాజీనామా చేస్తున్నామని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తెలిపారు.  అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుందని, అందువల్ల భవిష్యత్తు లో “మా” లో ఏ అభివృద్ధి పనులు జరక్కపోతే, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News