Monday, December 23, 2024

చంద్రయాన్ 3 పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ముంబై : సినీనటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్ 3 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎక్స్ (ట్విటర్ ) వేదికగా చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ నుంచి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను టీ వడపోస్తున్నట్టు ఉండే కన్నడ టాగ్‌తో కార్టూన్‌ను ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్టూన్‌లో చిత్రించిన వ్యక్తి ఎవరో ఆయన స్పష్టం చేయనప్పటికీ, మాజీ ఇస్రో చీఫ్ కె. శివన్ అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై విమర్శలు గుప్పించిన వారిలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ “ ఈ అవమానకరమైన ట్వీట్‌ను ఖండిస్తున్నాను.

ఇస్రో విజయం భారత్ విజయం ” అని ఆయన పేర్కొన్నారు. ఇస్రో విజయాలను రాజకీయ ద్వేషం నుంచి దూరంగా చూడాలని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఒక మైలురాయిగా భావిస్తున్న ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేయకూడదని మరికొందరు విమర్శించారు. తప్పు చేస్తే తప్పును చెప్పడంలో తప్పులేదు కానీ, ఏది పడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని మరికొందరు నెటిజన్లు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News