Saturday, November 16, 2024

బిజెపిలో చేరికపై ప్రకాష్ రాజ్ కౌంటర్!

- Advertisement -
- Advertisement -

సినీ నటుడు ప్రకాష్ రాజ్ బిజెపిలో చేరుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరుతున్నారంటూ ప్రత్యక్షమైన పోస్టులపై నెటిజన్ల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ప్రకాష్ రాజ్ స్వయంగా వివరణ ఇవ్వడంతో సోషల్ మీడియా శాంతించింది. అసలు ఏం జరిగిందంటే&ప్రముఖ నటుడు రకాష్ రాజ్ ఈ రోజు (ఏప్రిల్ 4వ తేదీ) మధ్యాహ్నం 3 గంటలకు బిజెపిలో చేరుతున్నారంటూ గురువారం మధ్యాహ్నం 2.55 గంటలకుది స్కిన్ డాక్టర్ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఒక పోస్టు వెలువడింది. ఈ వార్త వైరల్ కావడంతో కొన్ని గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. దీంతో ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ మరో పోస్టు పెట్టారు. వారు ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నాను.

అయితే నన్ను కొనేంత సంపద(సిద్ధాంతపరంగా) తమ వద్ద లేదని గ్రహించి ఉంటారు..మీరేం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటూ బిజెపికి ప్రకాష్ రాజ్ చురకలు అంటించారు. కాగా..2024 ఎన్నికలలో తనను బరిలోకి దింపేందుకు మూడు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఈ ఏడాది జనవరిలో ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అయితే సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలు తన వెంట పడడం లేదని, తాను ప్రధాని నరేంద్ర మోడీ విమర్శకుడిని కావడమే కారణమని ఆయన చెప్పారు. ఆ వలలో తాను పడబోనని 59 ఏళ్ల ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ ఆయన ఎక్కడ నుంచి, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో లేక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News