Wednesday, January 22, 2025

మంచి పనిని చెడగొట్టేందుకు కుట్ర

- Advertisement -
- Advertisement -

Prakash Raj's key remarks on TRS Rajya Sabha seat offer

 

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ నుంచి నటుడు ప్రకాష్‌రాజ్‌ను రాజ్యసభకు పంపిస్తారని జోరుగా ప్రచారం నడుస్తోన్న నేపథ్యంలో దానిపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నుం చి రాజ్యసభకు పంపిస్తారనే విషయం తనకు తెలియదన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న మం చి పనిని చెడగొట్టేందుకు దుష్ప్రచారం జరుగుతోందని మం డిపడ్డారు. రాజ్యసభ సీటు గురించి మా ట్లాడటానికి ఇది సరైన సమయం కాదని,అవన్నీ పుకార్లు అని అన్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉండే ప్రకాష్‌రాజ్‌కు కెసిఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిం ది. టిఆర్‌ఎస్ తరపున ప్రకాష్‌రాజ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ తన పదవికి రాజీనామా చేసి ఎంఎల్‌సి అయ్యారు. దాంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. జూన్‌లో టిఆర్‌ఎస్ సభ్యులు లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఖాళీల్లో ప్రకాష్‌రాజ్‌కు కేటాయించి.. జాతీయ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. అంతేకాదు, ప్రకాష్‌రాజ్‌కు జాతీయ స్థాయి బృందంలో చోటు కల్పించవచ్చుననే ప్రచారం కూడా కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News