- Advertisement -
న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్నట్లు విపక్షాలు చేసిన సంయుక్త ప్రకటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఆ పార్టీలు తమ నిర్ణయంపై పునరాలోంచాలని కోరారు. కాగా జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్ పార్టీకి కొరవడిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి విమర్శించారు.
పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబర్ 24న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని, ఆమె తనయుడు రాజీవ్ గాఃధీ కూడా 1987 ఆగస్టు 15న పార్లమెంటు లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారని పురి గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
- Advertisement -