Wednesday, January 22, 2025

మోడీ పేరుతో ఓట్లు అడిగే వారిని చెప్పుతో కొట్టండి: శ్రీరాం సేన చీఫ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: శ్రీరాంసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన బిజెపి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఓట్లు అడిగే బిజెపి నాయకులతో చెప్పులతో కొట్టాలని ముతాలిక్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫోటో వాడకుండా ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆయన బిజెపి రాష్ట్ర నాయకులకు సవాలు విసిరారు. తాము చేసిన అభివృద్ధి పనులను, గోరక్షణ, హిందూత్వకు సంబంధించి తాము చేసిన కార్యక్రమాలను తెలియచేస్తూ ప్రచారం సాగించాలని ఆయన ఇమాండు చేశారు. బిజెపికి మద్దతు ఇవ్వవద్దని, ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆ పార్టీ నాయకులకు మోడీ పేరు జపించడం తప్ప వేరే ఏమీ చేతకాదని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ పేరుతో ఓట్లు అడిగేవారిని పనికిమాలినవారిగా ఆయన అభివర్ణిస్తూ వారికి తమ నియోజకవర్గ సమస్యలు అర్థంకావడం లేదని ముతాలిక్ విమర్శించారు. తాను కర్కల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ముతాలిక్ జనవరి 23న ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News