Wednesday, January 22, 2025

గోవా సిఎంగా మళ్లీ సావంత్‌కే ఛాన్స్

- Advertisement -
- Advertisement -

Pramod Sawant to stay Goa chief minister

పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ ఎవరవుతారన్న సస్పెన్స్ సోమవారం సాయంత్రానికి ముగిసింది. మాజీ ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణే ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా పోటీలో ఉన్నా సోమవారం సాయంత్రం ఆయన ఆశలు నెరవేరలేదు. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్‌కే అవకాశం లభించింది. పనాజీలో సమావేశమై బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు తమ శాసనసభా పక్ష నేతగా ప్రమోద్ సావంత్‌ను ఎన్నుకున్నారు. ఇటీవల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలు గెల్చుకుంది. ఇద్దరు ఎంజీపీ ఎమ్‌ఎల్‌ఎలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎలు బిజెపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో సావంత్ ఎంపికకు మార్గం సుగమమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News