Thursday, January 23, 2025

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే…

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు అయోధ్యరాముణ్ని దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. మంగళవారంనుంచి అయోధ్యరాముడు భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఏయే మార్గాల్లో, ఎంత చౌకగా వెళ్లవచ్చో తెలుసుకుందాం.

ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లే ప్రయాణ సౌకర్యం ఏమీ లేదు. హైదరాబాద్ నుంచి లక్నోకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి బస్సులో  లేదా ట్రైన్ లో అయోధ్య చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ నుంచి వారణాసికి విమానంలోవెళ్లి అక్కడినుంచి ట్రైన్ లో అయోధ్యకు వెళ్లవచ్చు.

తక్కువ ఖర్చులో వెళ్లాలనుకునేవారు రైలు మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. హైదరాబాద్ నుంచి వారణాసికి రైలులో వెళ్లి, అక్కడినుంచి కారులో అయోధ్య చేరుకోవచ్చు. అయోధ్యకు వేగంగా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి లక్నోకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి కారులో అయోధ్య చేరుకోవచ్చు.

ఇదిలాఉంటే అయోధ్య రామమందిరం వద్ద  సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. మంగళవారంనుంచి భక్తులు తండోపతండాలుగా రాములవారిని దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఆలయం ఎదుట క్యూలలో నిలబడి ఉండటం గమనార్హం. కొందరు భక్తులు సరయూనదిలో స్నానం చేసి, అయోధ్య రాముణ్ని దర్శించుకునేందుకు వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News