ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలో ‘యజమానుల’ ప్రకటన
అయోధ్య : సోమవారం (22న) అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపనకు ‘ముఖ్య యజమానులు’గా వ్యవహరించిన దంపతులు ఆ వేడుకను ‘దైవానుగ్రహం, గర్వకారణమైన క్షణం’గా అభివర్ణించారు. ఆ రోజును తాము ఎన్నటికీ మరువలేమని వారు తెలిపారు. ప్రధాన ఉత్సవంలో యజమానులుగా లేదా ఆతిథ్య వక్తులుగా విధులు నిర్వర్తించేందుకు దేశవ్యాప్తంగాదళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల నుంచి 14 మంది దంపతులను ఎంపిక చేయగా ఆర్‌ఎస్‌స్ నేత అనిల్ మిశ్రా, ఆయన భార్య రోజువారీ ప్రక్రియలకు సారథ్యం వహించారు.
ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఆ ప్రక్రియలు ఈ నెల 16న మొదలయ్యాయి. ఆలయం నిర్మాణం పర్యవేక్షణు 2020లో ఏర్పాటైన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టీలు 15 మందిలో మిశ్రా ఒకరు. ‘ఆ రోజుల మాకు ఎన్నటికీ గుర్తు ఉండిపోతుంది. ఉత్సవం సమయంలో మా కనుల వెంబడీ నీళ్లు వచ్చాయి. అది ఒక దైవానుగ్రహం’ అని ‘డోమ్ రాజా’ కుటుంబానికి చెందిన అనిల్ చౌధురి చెప్పారు. తన భార్య సప్నా దేవితో కలసి చౌధురి ఆ ప్రక్రియలు నిర్వహించారు.
.