Tuesday, September 17, 2024

మన్మోహన్, మోడీలో వైరుధ్యాలేమిటి?

- Advertisement -
- Advertisement -

Pranab Mukherjee's presidential memoir to hit stands in January

సోనియా ఎందుకు విఫలమయ్యారు?
కాంగ్రెస్ పతనానికి కారణాలేమిటి?
మన్మోహన్ స్థానంలో ప్రణబ్ ప్రధాని అయ్యుంటే
వెల్లడించనున్న ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ

న్యూఢిల్లీ: బెంగాల్‌లోని ఒక మారు మూల గ్రామంలో మిణుకు మిణుకుమని వెలిగే కిరోసిన దీపం వెలుగులో చదువుకున్న ఒక సామాన్య పిల్లవాడు దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో దేశ తొలి పౌరునిగా కాలిడతాడని ఎవరైనా ఊహించగలరా? అనితర సాధ్యమైన తన జీవిత ప్రస్థానం గురించి మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ పంచుకున్న అనుభవాలు, జ్ఞాపకాలతో కూడిన ఆయన ఆత్మకథ త్వరలోనే పుస్తక రూపంలో వెలుగు చూడనున్నది. ”ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్” శీర్షికతోరూపా బుక్స్ ప్రచురిస్తున్న ఈ ఆత్మకథ 2021 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

రాష్ట్రపతిగా తను ఎదుర్కొన్న సవాళ్లను ప్రణబ్ ముఖర్జీ జ్ఙాపకాలతో వెలువడుతున్న నాలుగవ సంపుటం వివరించనున్నది. క్లిష్ట సమయాలలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలను, రాజ్యాంగ నిబంధనలకు లోబడి తన సొంత అభిప్రాయానికి కూడా విలువనిచ్చి విజ్ఞతతో నిర్ణయాలను తీసుకునే సమయంలో తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని ప్రణబ్ దా తన ఆత్మకథలో పొందుపరిచారు. భారత రాజకీయాలలో మేరునగధీరుడైన ప్రణబ్‌దా తాను ఎల్లప్పుడూ ప్రజల మనిషేనని చెప్పేవారని, ఆయన ఈనాడు మన మధ్య లేకపోయినా ఆయన నెలకొల్పిన అమూల్యమైన సంప్రదాయాలు, పాటించిన సిద్ధాంతాలు వారసత్వంగా మిగిలిపోయాయని రూపా పబ్లికేషన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కపిష్ జి. మెహతా పేర్కొనారు. ఈ పుస్తకం చదివిన పాఠకులకు ప్రణబ్ దా తన ఆఫీసు గదిలో కూర్చుని, టీ తాగుతూ తన ఆత్మకథను మనకు చెబుతున్నట్లు ఉండడం విశేషమని, ఇది ఆయన రచనా శైలికి నిదర్శనమని మెహతా తెలిపారు.

రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు ప్రధాన మంత్రులతో తాను పంచుకున్న అనుబంధాన్ని కూడా ప్రణబ్ దా తన ఆత్మకథలో పంచుకున్నారు. డాక్టర్ మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో సంకీర్ణ కాపాడుకోవడానికే ఆయన సమయం సరిపోయిందని, ఇది పాలనపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిందని ప్రణబ్ దా అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తన పాలనలో నియంతృత్వ పోకడలను అనుసరించారని, ఇది ప్రభుత్వానికి, పార్లమెంటరీ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య సంబంధాలను దెబ్బతీసిందని ప్రణబ్ దా తన పుస్తకంలో రాశారు.

ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా డుయ్యబట్టారు. 2004లో ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టి ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూసి ఉండేది కాదన్న కాంగ్రెస్ నాయకులు కొందరి అభిప్రాయంతో కూడా ఆయన విభేదించారు. ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించనప్పటికీ నేను రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో రాజకీయ పటిమ కొరవడిందని మాత్రం అంగీకరిస్తాను. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం సోనియా గాంధీకి సాధ్యపడలేదు..పార్లమెంట్‌కు మన్మోహన్ సింగ్ చాలాకాలం దూరంగా ఉండిపోవడంతో ఇతర ఎంపీలతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు లేకుండా పోయాయి అని ప్రణబ్ దా రాశారు. అత్యంత అరుదైన, అపురూపమైన ఫోటోలు, చేతిరాత ప్రతులతో కూడిన ఈ ఆత్మకథ వర్తమాన భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నాయకుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలను ఆవిష్కరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News