Monday, December 23, 2024

మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలు

- Advertisement -
- Advertisement -

Pranahita Pushkaralu start in Arjunagutta Mancherial

మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో పుణ్యస్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ప్రస్తుతం ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించటం మహాభాగ్యంగా భావిస్తున్నాని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ అర్జునగుట్టలో బుధవారం మంత్రి ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దంపతులు, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిలు మధ్యాహ్నం 3.50 గంటలకు పు ష్కరుడికి పూజలు చేసి పుణ్యస్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సారథ్యంలో గో దావరి, కృష్ణ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా నిర్వహించామన్నా రు.

ప్రాణహిత పుష్కరాలను బుధవారం నుం చి ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ పుష్కరాలకు తెలంగాణ సహా ఇతర రా ష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, దానికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పా ట్లు చేశామన్నారు. యుద్ధప్రాతిపదికన పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం దేవాదాయశాఖ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు ఇతర దేవస్థానాల ముస్తాబు (పెయింటింగ్స్, లైటింగ్ తదితర పనులు), ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, డ్రెస్ చేంజింగ్ రూంలను ఏర్పాటు చేసిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News