Saturday, November 23, 2024

నగరంలో ప్రణామ్ కర్కినోస్ క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: క్యాన్సర్ కేర్‌లో విప్లవాత్మక మార్పులకు గా ను కార్కినోస్ హెల్త్‌కేర్, ప్రణామ్ హాస్పిటల్స్ చేతులు కలిపాయి. కాన్సర్‌ను ముందుగా వ్యాధిని గుర్తించటం, తద్వారా అవసరమైన చికిత్సను అం దించేందుకు హైదరాబాద్‌లోని ప్రణామ్ హాస్పిటల్స్‌లో ప్రణామ్ కర్కినోస్ క్యాన్సర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అత్యాధునిక సదుపాయం క్యాన్సర్‌పై పోరాటంలో ముందస్తుగా గుర్తించడంపై ఖచ్చితమైన దృష్టితో అత్యుత్తమ నాణ్యత గల సేవలను అందించడానికి కృషి చేయనున్నారు. .

‘క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధి, దీనిని ఎదుర్కోవడంలో మేము ముందంజలో ఉన్నందుకు గర్విస్తున్నామని మెడికల్ డైరెక్టర్ , సహ వ్యవస్థాపకుడు, సిఇఓ కేరళ ఆపరేషన్స్ కర్కినోస్ హెల్త్‌కేర్. డాక్టర్ మోని అబ్రహం కురియకోస్ అన్నారు. ‘క్యాన్సర్‌తో పోరాడడంలో మా అచంచలమైన నిబద్ధత ఈ సదుపాయం ద్వారా నిరూపించబడుతుందని ఆయన వెల్లడించారు. ప్రణామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గౌర్ మాట్లాడుతూ, ‘ప్రణామ్ హాస్పిటల్స్ కార్కినోస్ హెల్త్‌కేర్‌తో చేతులు కలపడం ఆనందంగా ఉందన్నారు. ఈ సహకారం క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మా భాగస్వామ్య నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News