ప్రపంచ చెస్‌లో భారత్ మరోసారి మెరిసింది. కొన్ని రోజుల క్రితం సీనియర్ ప్రపంచ చెస్‌లో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు చెందిన ప్రణవ్ వెంకటేష్ విజేతగా నిలిచాడు. బెంగళూరుకు చెందిన ప్రణవ్ ప్రపంచ అండర్20 చెస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ప్రణమ్ చివరిదైన 11వ రౌండ్‌ను డ్రాగా ముగించి విశ్వవిజేతగా నిలిచాడు.
మాటిచ్ లెవ్రెనిచ్(స్లొవేనియా)తో జరిగిన 11వ రౌండ్ గేమ్‌ను ప్రణవ్ డ్రా చేసుకున్నాడు. దీంతో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ప్రణవ్ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో అసాధారణ ఆటను కనబరిచిన ప్రణవ్ 7 విజయాలు, 4 డ్రాలతో అలరించాడు. గతంలో జూనియర్‌విభాగంలో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, అభిజిత్ గుప్తా విజేతగా నిలిచారు. కాగా, విశ్వవిజేతగా నిలిచిన ప్రణవ్‌ను ప్రపంచ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎక్స్‌లో అభినందించారు.