Wednesday, January 22, 2025

కరేబియన్ లీగ్‌కు ప్రణవి చంద్ర ఎంపిక

- Advertisement -
- Advertisement -

అభినందించిన జగన్ మోహన్ రావు

మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మహిళా కరేబియన్ లీగ్‌లో భారత్ నుంచి ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. సెలెక్ట్ అయిన వారిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన క్రికెటర్ ప్రణవిచంద్ర కూడా ఉంది. ఈ సందర్భంగా హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నుంచి ఈ లీగ్‌కి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర కావడం గర్వించదగ్గ విషయం.

బిసిసిఐ స్వదేశీ క్రికెటర్లను అనుమతించిన మూడు ప్రీమియర్ లీగ్‌లలో ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఒకటి. మిగతా రెండు డబ్ల్యూపిఎల్, బిగ్ బాష్ లీగ్. ప్రతిష్టాత్మక కరేబియన్ లీగ్‌కు ప్రణవి ఎంపికకావడం హర్షణీయం’ అని అన్నారు. అనంతరం ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వర్ నాథ్‌తో కలిసి ప్రణవి చంద్రని సత్కరించి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభా కనబరచాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News