Friday, December 20, 2024

ప్రణయ్ ముందుకు

- Advertisement -
- Advertisement -

శ్రీకాంత్, లక్షసేన్ ఇంటికి

 

జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్. ఎస్.ప్రణయ్ ముందంజ వేశాడు. బుధవా రం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ప్రణయ్ భారత్‌కే చెందిన అగ్రశ్రేణి ఆటగాడు లక్షసేన్‌ను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ప్రణయ్ 2110, 219 తేడాతో సేన్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ప్రణయ్ ఏ దశలో నూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో కిదాంబి శీకాంత్ ఓటమి పాలయ్యాడు. లెవర్‌డెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ పరాజయం చవిచూశాడు. అద్భుత ఆటను కనబరిచిన లెవర్‌డెజ్ 2321, 2110 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించి ముందంజ వేశాడు. తొలి గేమ్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఈ సెట్‌లో శ్రీకాంత్ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇక మహిళల డబుల్స్‌లో అశ్వినిశిఖా, హరితఆశ్న జోడీలు ఓటమి పాలయ్యాయి. అయితే పురుషుల డబుల్స్‌లో అర్జున్‌ధ్రువ్ జోడీ ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News