మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన ఎస్‌సి,ఎస్‌టి కేసుల ప్రత్యేక కోర్టులో బుధవారం నాడు సాక్షుల విచారణ ప్రారభమైంది. ఈక్రమంలో ప్రణయ్ కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు జులై 21 వరకు మొత్తం 102 మందిని విచారించనుంది. 2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో సాక్షుల విచారణ నెల 3న నుంచి జులై 21 వరకు రోజుకు కొంతమంది చొప్పున మొత్తం 102 మందిని న్యాయస్థానం విచారించనుంది. ఈ హత్య కేసులో ఎస్‌సి,ఎస్‌టి కేసుల ప్రత్యేక న్యాయస్థానం గతేడాది జనవరి నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉండగాకరోనా ఉద్ధృతి కారణంగా కోర్టుల్లో భౌతిక విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 3న ప్రారంభమైన విచారణలో.. 11 తేదీ వరకు ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరాలను నమోదు చేసుకుంది.హత్య నుంచి ఆత్మహత్య వరకు 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి, హతమార్చగా ఈ హత్యకు సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను 2018 సెప్టెంబరు 18న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోని నిందితుల్లో అమృత తండ్రి మారుతీరావు, సుభాష్‌శర్మ, అబ్దుల్‌బారీ, అస్గర్‌అలీ, అబ్దుల్ కరీం, శ్రవణ్‌కుమార్, డ్రైవర్ శివ, నిజాం ఉండగా ఈ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
ప్రణయ్ హత్య కేసు సాక్షుల విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -