Saturday, December 21, 2024

రేవంత్ ఇంటి సమీపంలో ప్రణీత్ ఆఫీస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీబ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ వ్య వహారంలో కీలక సూత్రధారి డిఎస్‌పి ప్రణీత్‌రావును సిట్ విచారిస్తున్నది. సిట్ విచారణలో విస్మయకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నా యి. ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోనే ప్రణీత్‌రావు ఆఫీసు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచే రేవంత్‌రెడ్డి, ఆయన సోదరు లు, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని వి చారణలో బయటపడింది. ఈ వ్యవహారంతో సం బంధం ఉన్న ఎఎస్‌పిలు భుజంగరావు, తిరుప త న్నను సిట్ అధికారులు శనివారం అరెస్టు చేశా రు. నేడు జడ్జి ముందు హాజరుపర్చనున్నారు.

ప్ర ణీత్ రావుతో కలిసి ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన స మయంలో భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ చేసిన ట్లు ప్రణీత్ చెప్పడంతో ఆయనను అదుపులోకి తీ సుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చే స్తున్న పోలీసులు ఇద్దరు ఎఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావును విచారణకు పిలిచారు. ఉద యం నుంచి ఇద్దరినీ విచారించిన అధికారులు, భుజంగరావును ఎనిమిది గంటల పాటు విచారించి, సా యంత్రం అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. భుజంగరావు, ప్రణీత్ రావును ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. ఎఎస్‌పి భుజంగరావును ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఆరు రోజుల కస్టడీ ముగియడంతో ఆ దివా రం జడ్జి ఇంట్లో హాజరుపరచనున్నారు.

మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎస్‌ఐబిలో పనిచేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను సిట్ విచారణకు పిలుస్తున్నట్లు తెలిసింది. నోటీసులు ఇవ్వడంతో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన ఎఎస్‌పి తిరుపతన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబిలో పనిచేసిన వారిని విచారణకు పిలువనున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పోలీసులు శనివారం సోదా లు చేశారు.

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు ఇళ్లతోపాటు పలువురు ఇళ్లల్లో సోదా లు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ మాజీ ఎఎస్‌పి భుజంగరావు, ఎస్‌ఐబి ఎఎస్‌పి తిరుపతన్న ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఏకకాలంలో 10 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సో దాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు. ఓ న్యూస్ చానల్ ఎండి శ్రీధర్ రావు ఇంట్లో కూడా పోలీసులు నిర్వహించినట్టు సమాచారం. అయితే, శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి.

హైదరాబాద్ దాటిన అధికారులు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఐ న్యూస్ ఛానల్ అధినేత శ్రీధర్‌రావు విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది. ప్రభాకర్‌రావు అమెరికాలో, శ్రీధర్‌రావు లండన్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రభు త్వం ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు రాగానే తమ మెడకు చుట్టుకుంటుందని వీరు ముందుగానే విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది.

ఎన్నికల్లో ట్యాపింగ్
మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో జోరు గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్‌ను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నిక సమయంలో బిఆర్‌ఎస్‌తో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి, వారి సమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వారు డబ్బులు తరలిస్తున్న విషయాలు తెలుసుకుని ముందుగానే పోలీసులు పట్టుకునే విధంగా చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News