ప్రస్తుతం స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్ గర్భవతులు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలోకి మరో బ్యూటీ కూడా చేరబోతోంది. అందాల తార ప్రణీత తల్లి కాబోతోంది.అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం, పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురూ ప్రేమకోసమే లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ బ్యూటీ బెంగళూర్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును గత ఏడాది పెళ్ళి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో తాను గర్భిణీ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ప్రణీత… “నా భర్త 34వ పుట్టిన రోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రణీత, ఆమె భర్తను అభినందిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.