Monday, December 23, 2024

భారత షట్లర్ల శుభారంభం

- Advertisement -
- Advertisement -

Prannoy, Lakshya cruise into 2nd round

రెండో రౌండ్‌లో లక్షసేన్, శ్రీకాంత్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

టోక్యో: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్షసేన్, హెచ్.ఎస్.ప్రణయ్ తదితరులు శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం శ్రీకాంత్ విజయం సాధించాడు. ఐర్లాండ్‌కు చెందిన ఎన్‌గ్యూయెన్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో శ్రీకాంత్ జయకేతనం ఎగుర వేశాడు. దాదాపు గంట పాటు సాగిన పోరులో శ్రీకాంత్ 2220, 2119 తేడాతో జయభేరి మోగించాడు. మరో మ్యాచ్‌లో అగ్రశ్రేణి షట్లర్ ప్రయణ్ విజయం సాధించాడు. ఆస్ట్రియాకు చెందిన లుకా వ్రాబర్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 2112, 2111 తేడాతో సునాయాస విజయం అందుకున్నాడు. ఇక యువ సంచలనం లక్షసేన్ కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. డెన్మార్క్ షట్లర్ హన్స్ క్రిస్టియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్షసేన్ జయకేతనం ఎగుర వేశాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో లక్షసేన్ 2112, 2111 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి ముందంజ వేశాడు. అయితే మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ బన్సొద్ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News