Wednesday, January 22, 2025

యువ దర్శకుడితో 108వ సినిమా

- Advertisement -
- Advertisement -

Prasanth Varma to plane movie with Balakrishna?

నందమూరి బాలకృష్ణ నటించిన ’అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ సీనియర్ స్టార్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ 107వ సినిమాగా ’వీరసింహారెడ్డి’ రాబోతోంది.దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్ గా తెరకెక్కిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఒక సాంగ్ మినహా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య తదుపరి మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ 108వ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హోస్టు చేస్తున్న’అన్ స్టాబుల్- 2’ షో టీజర్‌కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేశాడు. ఇటీవల విడుదలైన ’అన్ స్టాపబుల్- 2’ టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు ఓ కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు.

Prasanth Varma to plane movie with Balakrishna?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News