Wednesday, January 22, 2025

ఆయన నా భర్తే: సినీ నటి లీనా

- Advertisement -
- Advertisement -

తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు వెళ్తున్న ఆస్ట్రోనాట్లలో ఒకరైన ప్రశాంత్ బాలకృష్ణన్ తన భర్తేనని ప్రముఖ మలయాళ నటి లీనా తెలిపారు. ఆయనతో ఇటీవలే తనకు వివాహమైందని ఆమె చెప్పారు. భారత్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్ యాన్ లో పాల్గొంటున్న నలుగురు ఆస్ట్రోనాట్ల పేర్లను ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు.

బాలకృష్ణన్ తో తనకు వివాహమైన విషయాన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రహస్యంగా ఉంచాల్సి వచ్చిందనీ, దాన్ని వెల్లడించేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని లీనా అన్నారు. జనవరి 17న ప్రశాంత్ తో తనకు వివాహమైందనీ, పెద్దలు కుదిర్చిన తమ పెళ్లికి తక్కువమంది అతిథులనే ఆహ్వానించామని ఆమె చెప్పారు.

మలయాళంలో పలు సినిమాల్లో నటించిన లీనా స్క్రిప్ట్ రైటర్ కూడా. ఆమె పలు హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించారు. లీనా గతంలో అభిలాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నా, కొన్నేళ్ల క్రితం ఆయనకు విడాకులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News