Thursday, December 19, 2024

ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర ఆరంభం

- Advertisement -
- Advertisement -

Prashant Kishor Begins Padayatra in Bihar

భితిహర్వా: ఎన్నికల వ్యూహకర్త రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ బీహార్‌లోని చంపారాన్ జిల్లా నుంచి ఆదివారం తమ పాదయాత్ర ఆరంభించారు. జన్ సురాజ్ ఉద్యమం పేరిట బీహార్‌లో తమ పాదయాత్ర 3500 కిలోమీటర్లు సాగుతుందని తెలిపారు. గాంధీజీ జయంతి నాడు పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయాలలో చేరేందుకు ముందస్తు సూచిక అని విశ్లేషకులు తెలిపారు. ఇక్కడి గాంధీజీ ఆశ్రమం నుంచి ప్రశాంత్ పాదయాత్ర మొదలైంది. ఈ ఏడాది మే నెలలోనే ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడే తాను రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు దిగుతానని ప్రకటించారు.

Prashant Kishor Begins Padayatra in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News