Sunday, December 22, 2024

రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఈ యాత్రను తమిళనాడు నుంచి ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తమిళనాడు నుంచి కాకుండా గుజరాత్ నుంచి లేదా బిజెపి పాలిత ఇతర రాష్ట్రాలు యూపి లేదా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ప్రారంభిస్తే బాగుండేదని తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రశాంత్ కిశోర్ మంగళవారం మహారాష్ట్ర వెళ్లారు. మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం నిర్వహించిన క్యాంపెయిన్‌లో ప్రశాంత్ కిశోర్ మంగళవారం పాల్గొన్నారు. మహారాష్ట్ర తూర్పు రీజియన్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి వ్యూహాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో మాజీ బిజెపి ఎంఎల్‌ఎ అశిశ్ దేశ్‌ముఖ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. ప్రజలకు ఆ లక్ష్యం, ఆశ ఉంటే విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు.

అయితే, ఆ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన కేంద్రానికి చేరాలని చెప్పారు. ఈ ఉద్యమ ప్రభావం యావత్ దేశంపై పడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ఉద్యమం సమాజంలో నుంచి పుట్టుకు రావాలని వివరించారు. తాను రాజకీయ వ్యూహకర్త పని చేయడాన్ని మానుకున్నట్టు పికె చెప్పారు. తాను ఏ పార్టీ కోసం పని చేయాలని భావించడం లేదని, కేవలం ప్రజల కోసం శ్రమించాలని నిర్ణయించానని వివరించారు. ప్రశాంత్ కిశోర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. సోనియా గాంధీతోనూ ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరితే తన వ్యూహకర్తగా చేసే పనులను వదిలిపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం పెట్టినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ షరతు వల్లనే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా విరమించుకున్నట్టు సమాచారం.

Prashant Kishor comments on Rahul Gandhi Jodo Yatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News