- Advertisement -
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తనకు ముఖ్య సలహాదారుగా నియమించడంపై బిజెపి విమర్శలు ఎక్కుపెట్టింది. టిఎంసి అధ్యక్షురాలు మమతాబెనర్జీకి బెంగాల్ ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌కిషోర్ ఆమెకు వీడ్కోలు పలికినట్టేనని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌పాత్రా ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రశాంత్ దీదీ(మమత)ని వదిలేశారు. ఆమె అతిపెద్ద సలహాదారు మరొకరి దగ్గర చేరారు. ఇది ఎన్నో విషయాల్ని చెబుతుంది అంటూ పాత్రా మీడియాతో అన్నారు. బిజెపి అగ్రనేతలు అమిత్‌షా, జెపి నడ్డాలు చెప్పినట్టు 294స్థానాలున్న బెంగాల్‌లో 200కుపైగా తమ పార్టీ గెలుచుకుంటుందని అందరూ ఆమోదిస్తున్నారని, ఇప్పుడు రాజకీయ సలహాదారు కూడా ఆ వాస్తవాన్ని గ్రహించారని పాత్రా వ్యాఖ్యానించారు.
- Advertisement -