Monday, December 23, 2024

ఎగ్జిట్ పోల్స్ కు ముందే బిజెపి గెలుస్తుందన్న ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024 ఎగ్జిట్ పోల్స్ కు కొన్ని గంటల ముందే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి-ఎన్ డిఏ కూటమి  లోక్ సభ ఎన్నికల్లో 303 కు పైగా సీట్లు గెలుస్తుందని అన్నారు. బిజెపి ఈసారి మెరుగైన ఫలితాలతో తిరిగొస్తుందన్నారు. ఆయన ‘ద ప్రింట్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.

బిజెపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో తన సంఖ్యను పెంచుకుంటుందని కూడా అన్నారు.

‘‘ మోడీ నేతృత్వంలోని బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుంది. మునుపటి కన్నా కాస్త మెరుగైన ఫలితాలతోనే అధికారంలోకి వస్తుంది’’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు ఎన్ డిటివి పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News