Monday, December 23, 2024

కెసిఆర్ అమ్ములపొదిలోనే పీకే

- Advertisement -
- Advertisement -

Prashant Kishor meet CM KCR at Pragathi Bhavan

జాతీయ రాజకీయాలపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘ చర్చ

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు
బిజెపి వ్యతిరేక వ్యూహాలకు పదును, కూడా ఇరువురి మధ్య సమావేశం పీకే కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారానికి తెరపడినట్టేనా?

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయ్యారు. శనివారం ప్రగతి భవన్‌లో ఇరువురు సుదీర్ఘంగా జాతీయ రాజకీయాలపై మంతనాలు సాగించారు. పీకే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, టిఆర్‌ఎస్ సహా పలు ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్వయంగా కెసిఆర్‌తో సమావేశం కావడం ఆ ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఇద్దరి నడుమ ప్రధానంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా లౌకికవాదాన్ని బల పరిచే శక్తులను ఒక్కతాటిపైకి తేవడంపైనే వీరి నడుమ ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వ్యూ హానికి పీకే పూర్తిగా మద్దతు తెలిపినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాల్లో వివిధ శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కెసిఆర్ వంటి నాయకుడు అవ సరమని పీకే కూడా అభిప్రాయపడినట్లు సమా చా రం. వీరి సమావేశంలో వివిధ రాష్ట్రాల వారీగా ఆయా పార్టీల బ లాబలాలు, ఎత్తుగడలు, బీజేపీని ఎవరు ఎంతమేరకు ఎదుర్కొగలరన్న చర్చతో పా టు చర్చ జరిగినట్లు తెలిసింది. ఆదివా రంనాడు కూడా ఇరువురూ సమావేశం కానున్నా రు.

ఈ భేటీ తర్వాత వివిధ రాజకీయ అంశాలపై స్పష్టత రానుందని టిఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేర బోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో కీలక ప్రాంతీయ పార్టీ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం పటాపంచలైంది. ఇదిలా వుండగా బిజెపియేతర జాతీయ రాజకీ య వేదిక రూపొందించడం పైనా కెసిఆర్, పీకే నడుమ చర్చ జరిగినట్లు తెలిసింది. దేశంలో రాజకీయ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణ పై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టవలసిన కార్యాచరణపై మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో బిజెపి మతం వంటి సున్నితమైన అంశాలను లేవనెత్తి ప్రజలు భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనే అంశాలపై ఇరువురు సుధీర్ఘంగా చర్చించారు. త్వరలో జరుగ నున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలా…? వద్దా..? ఒకవేళ అభ్యర్థిని పోటీ నిలిపితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఇటు ప్రాంతీయ పార్టీలు, అటు భావ సారూప్యత కలిగిన లౌకిక శక్తులతో కలిపి ఏవిధంగా కూటమిని రూపొందించాలనే విషయంపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాలు, ప్రాంతాల బలబలాలలను అంచనా వేసుకుని దేశ రాజకీయ పరిస్థితులను చర్చిస్తున్నట్లు తెలిసింది.

Prashant Kishor meet CM KCR at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News