Sunday, January 19, 2025

సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ బేటీ

- Advertisement -
- Advertisement -

Prashant Kishor meets with Sonia Gandhi

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చించేందుకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోనీ, దిగ్విజియా సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల బ్లూప్రింట్ పైనా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News