ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ సివిల్స్ సర్వీస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా ఆయన గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటేటివ్ (ప్రిలిమనరీ) ఎగ్జామినేషన్ 2024 ను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు.
వారి ఆందోళన వేదిక గార్డని బాగ్‌కు రెండు కిమీ దూరంలో ప్రశాంత్ కిషోర్ ఆందోళన వేదిక ఉండడం గమనార్హం. ఆదివారం రాత్రి నిరుద్యోగులపై పోలీస్‌లు లాఠీ ఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడ నుంచి వెళ్లిపోవడం అభ్యర్థులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో రెండింట మూడొంతులు స్తానికులకే లభించేలా రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.