Thursday, March 6, 2025

నితిశ్ కూటమి ఓటమి తప్పదు:ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, జెడియూ కూటమి దారుణంగా ఓటమి పాలవుతుందని.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల లో ఓటమి తర్వాత.. బీజేపీని వీడి, మళ్లీ సీఎం అయ్యేందుకు మరో పార్టీతో జేడీయూ అధినేత నితిశ్ కుమార్ జతకడతారని అతడు అన్నారు. గతంలో జేడీయూ నుంచి బహిష్కరణకు గురై స్వయంగా జన సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత కిశోర్ చంపారణ్ జిల్లాలో ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షం దారుణంగా ఓటమి పాలు కాగలదని ఆయన పేర్కొన్నారు. నితిశ్ కుమార్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పారు.

అయినా నితిశ్ కుమార్ మళ్లీ సీఎం కావాలనే కోరుతున్నారని, ఏదో ఒక పార్టీతో కూటమి కట్టి సీఎం గద్దెను ఎక్కే అవకాశం లేకపోలేదని ప్రశాంతకిశోర్ చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా నితిశ్ కుమార్ ను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతకుముందే నితిశ్ కుమార్ ఎన్డీఏకు గుడ్ పై చెబుతారనే మాట బహిరంగంగానే విన్పిస్తోంది. బీజేపీ – జెడీయూ కూటమిగానే నితిశ్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారని తాను భావిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. నితిశ్ కుమార్ కు రోజురోజుకూ ప్రజాదరణ తగ్గుతున్నందు వల్ల వచ్చే ఎన్నికల తర్వాత ఆయనను మరో సారి సీఎం చేస్తామని ప్రకటించే స్థితిలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లేరని ఆయన స్పష్టం చేశారు. నితిశ్ కారణంగా బీజేపీకూడా చాలా చోట్ల ఓటమి పాలు కాగలదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News