న్యూఢిల్లీ : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా ధ్రువీకరించారు. 2024 ఎన్నికల సన్నద్దత కోసం కాంగ్రెస్ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించిన తరువాత కాంగ్రెస్ పార్టీ యాక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కమిటీలో ఉండేందుకు పీకే అంగీకరించలేదని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించగా నిరాకరించారని సూర్జేవాలా చెప్పారు. ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనల్ని తాము అభినందిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై ప్రశాంత్ కిశోర్ కూడా ట్వీట్ చేశారు. సాధికారత కమిటీలో చేరాలని , ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిపారు. నిర్మాణం పరంగా లోతైన సమస్యల్లో పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తనకన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -