Sunday, December 22, 2024

లోక్‌సభ ఎన్నికలబరిలో ప్రశాంత్‌కిషోర్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యమకారుడిగా మారిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బిహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు. తను కాని తమ సంస్థ సభ్యులు కాని ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు స్పష్టంగా ప్రకటించలేదు. అయితే 95శాతం కిషోర్ మద్దతుదారులు 2024 లోక్‌సభ తమ నేత పోటీచేయనున్నట్లు తెలుపుతున్నారు. వారి వాదనకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలో పాల్గొనేవారి అభిప్రాయంపైనే తన తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని తరుచుగా చెపుతుండటం బలాన్నిస్తోంది. జన్ సూరజ్ పాదయాత్ర పేరిట ప్రశాంత్‌కిషోర్ చేస్తున్న పాదయాత్రలో ఆదివారం తన మద్దతుదారులతో పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీచేయాలా వద్దా అనేదానిపై తొలిసారి పోల్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తూర్పు చంపారన్ జిల్లాలో ఈ పోల్ నిర్వహించారు. అంతకుముందు గత నవంబర్‌లో పశ్చిమ చంపారన్ జిల్లాలో తన అనుచరులతో రాజకీయపార్టీ ఏర్పాటుపై పోల్ నిర్వహించగా 97శాతం రాజకీయ పార్టీ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు.

2,887 మందిలో 2,808అనుకూలంగా ఓటు వేశారు. అదేవిధంగా తూర్పు చంపారన్‌లో 98శాతానికిపైగా మద్దతుదారులు రాజకీయ పార్టీ ఏర్పాటుకు మద్దతిచ్చారు. 3691మందిలో 3515మంది 95శాతం తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని కోరుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రజాసమస్యలపై నిర్వహించిన సర్వేలో 50శాతం మంది నిరుద్యోగం, వలసలు బిహార్ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. 33శాతంమంది అవినీతి తీవ్ర సమస్యగా తెలిపారు. 17శాతానికిపైగా రైతుల ఇక్కట్లు ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక ఏ రాజకీయపార్టీ ఎన్నికల వ్యూహకర్తగా భాగస్వామిగా ఉండను అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని కిషోర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. యాత్రలో సిఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్షంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. గతంలో కొంతకాలం ప్రశాంత్ కిషోర్ రాజకీయవేత్తగా నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి పార్టీ మద్దతు ఇవ్వడంపై కిషోర్ జేడియుకి వ్యతిరేకంగా గళమెత్తడంతో జనవరి 2020లో ఆయనపై జనతాదళ్ (యు) బహిష్కరణ వేటు వేసింది. ఆ సమయంలో బిహార్ సిఎం నితీశ్‌కుమార్ బిజెపి సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News