Monday, January 20, 2025

బెంచ్ మార్క్ సెట్ చేసేలా క్లైమాక్స్

- Advertisement -
- Advertisement -

Prashanth Neel about Salaar Climax

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జ్జెట్ మూవీ ‘సలార్’. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశముంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతారా మూవీ తాజాగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ క్లైమాక్స్ చూసి ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ బాగా ఎంజాయ్ చేశారట. ‘సలార్’లో క్లైమాక్స్ కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంటుందని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆనందపడిపోతున్నారు.

Prashanth Neel about Salaar Climax

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News