Sunday, January 19, 2025

ఆంబోతులా రంకెలేస్తున్న అరవింద్ : ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : కాంగ్రెస్ మనసులో ఉన్న మాటనే టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బయట పెట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభలో రైతులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అదే పాలసీ అమలు చేస్తామని చెప్పారా? అని ప్రశాంత్ రెడ్డి అడిగారు. ఛత్తీస్ ఘడ్ లో మిగులు విద్యుత్ ఉన్న కూడా అక్కడి రైతులకు ఇస్తున్నది 8 గంటలేనని ఎద్దేవా చేశారు.  మిగులు విద్యుత్ అమ్ముకుంటారు తప్పా… రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది కాంగ్రెస్ విధానం కాదని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో చిమ్మని చీకట్లు కమ్ముకుంటాయని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాపనార్ధాలు పెట్టారని, రాష్ట్ర అసెంబ్లీలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని సిఎం కెసిఆర్ అంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అది సాధ్యం కాదన్నారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి నోటి నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అని యాక్సిడెంటల్ గా రాలేదని, కాంగ్రెస్ విధానాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎకరం పారడానికి గంట సేపు కరెంట్ చాలు అని కండ కావరంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడానికి కెసిఆర్ ఎంత కష్టపడ్డాడో..బ్లాక్ మెయిలర్, బ్రోకర్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి 3 పంటలకు నీళ్లు, కరెంట్ ఇచ్చే బిఆర్ ఎస్ కావాలో? రైతులే తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతే గోస పడతామని, ఎంపి అరవింద్ మాటలు నమ్మే ఒకసారి మోస పోయామన్నారు. పసుపు బోర్డు పేరుతో అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేశారని, ప్రస్తుతం ఆంబోతులాగా  వేముల ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. అరవింద్ ఆరోపణలు అర్థరహితమని, సిబిఐ లేదా దాని అయ్య దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. బిజెపి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే కాంగ్రెస్ ఉచిత కరెంట్ వద్దు అంటుందని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News