Wednesday, January 22, 2025

కిషన్ రెడ్డి, బండి, అర్వింద్‌లకు తెలంగాణ పౌరుషం లేదా?: ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Prashanth Reddy comments on BJP leaders

 

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చేత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్, ఎంపి అర్వింద్‌లకు తెలంగాణ పౌరుషం లేదా? అని అడిగారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని, తెలంగాణను ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానిస్తుంటే మీరేం చేస్తున్నారని అడిగారు. బాగుపడుతున్న తెలంగాణను మళ్లీ ఎపిలో కలుపుతారా? అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బిజెపి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బిజెపి తెలంగాణలో అవసరమా? అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News