- Advertisement -
హైదరాబాద్: రోడ్ల భవనాల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని బిజెపి ఎంపి అరవింద్ ఆరోపణలు చేయడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. డబుల్ బిల్లింగ్‌కు ఆస్కారమే లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిధులు పక్కదారి పట్టలేదని, అరవింద్ ఆరోపణలపై సిబిఐతో విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఒక్క నిజామాబాద్‌లో జిల్లాలో రోడ్ల భవనాల శాఖలో రూ.318 కోట్ల కుంభకోణం జరిగింది, ఒకే పనికి రెండు రకాల నిధుల పేరుతో స్వాహా చేశారని బిజెపి ఎంపి అరవింద్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: ఆ నాలుగు జిల్లాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్
- Advertisement -