Wednesday, January 8, 2025

టిటిడి సలహా మండలి చైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తిరుమలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టిటిడి సలహా మండలి చైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తులకు అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నామని, ఉత్తర భారత దేశంలోని టిటిడి ఆలయాల సలహా మండలికి చైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇఒ ధర్మారెడ్డి, ఎంపి వేమి రెడ్డి, టిటిడి ఢిల్లీ ఎల్‌ఎసి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News