Monday, December 23, 2024

పొట్టిగట్టి బాడీబిల్డర్ పెళ్లికొడుకాయే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలో అతి పొట్టి బాడీబిల్డర్ ప్రతీక్ విఠల్ మోహితే ఓ ఇంటివాడయ్యాడు. శరీరసౌష్టవంలో దిట్ట అన్పించుకున్న ఈ బాడీబిల్డర్ ఎత్తు కేవలం 3 అడుగుల 4 అంగుళాలు. జయ అనే 4 అడుగుల 2 అంగుళాల యువతిని ప్రతీక్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మరాఠా అయిన ప్రతీక్ ప్రపంచంలో అతి పొట్టి మగ బాడీబిల్డర్‌గా 2021 గిన్నీస్ బుక్ రికార్డులలో చేరాడు. ప్రతీక్ వయస్సు 28 ఏండ్లు. ఆయన 22 సంవత్సరాల జయను నాలుగేళ్ల క్రితం పరిచయం చేసుకున్నాడు. తన లాగానే పొట్టిగా ఉండే ఈ యువతితో ప్రేమలో పడి, ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుని చివరికి మనువాడాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ పొట్టిజంటగా నిలిచారు. పెళ్లి వేడుక ముచ్చటగా సాగింది.

ఓ చోట వరుడి వస్త్రాలతో నెత్తిన పాగాతో ఆయన డాన్స్ చేయడం, తన పెళ్లి వేడుకకు వచ్చిన వారితో కలిసి డాన్స్ చేయడం, చివరికి అక్కడి కారు పై నిలబడి కూడా పాటకు అనుగుణంగా స్టెప్స్ వేయడంతో ఈ పెళ్లి వేడుకకు మరింత కళ వచ్చింది. ఆ తరువాత ఈ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొట్టొచ్చినట్లుగా నిలిచి ఫోటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాలకు పంపించారు. తాను ఎప్పుడూ తన ఎత్తు గురించి ఆందోళన చెందలేదని, పొట్టివాడినైనా గట్టి రికార్డు సాధించాలని తపించానని, బాడీబిల్డర్‌గా పొట్టి గట్టివాడిగా పేరు తెచ్చుకోవాలని యత్నించానని, ఇది సాధించి ఇప్పుడు పెళ్లి చేసుకుని మరో జయం సాధించానని తన భార్య జయను పేర్కొంటూ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News