Monday, December 23, 2024

నటుడు ప్రతాప్ పోతన్ ఇకలేరు…

- Advertisement -
- Advertisement -

Prathap pothan passed away in chennai

 

చెన్నై: సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ (69) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో పోతన్‌కు గుండె పోటు రావడంతో చెన్నైలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోతన్ మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రగాడ సానుభూతి ప్రకటించారు. వ్యాపారస్థుల కుటుంబంలో జన్మించినప్పటికి సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు, తమిళం, మలయాళాలో వందకుపైగా సినిమాలలో నటించారు. ఆకలిరాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కలో చంద్రుడు, మరో చరిత్ర, వీడెవడు వంటి చిత్రాలలో నటించారు. 1985లో రాధికను పెళ్లి చేసుకొని ఓ సంవత్సరం తరువాత విడిపోయారు. 1990లో అమలా సత్యానాథ్ అనే మహిళను అతడు పెళ్లి చేసుకున్నప్పటికి 2012లో ఈ జంట విడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News