Friday, December 20, 2024

‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్ టీజర్..

- Advertisement -
- Advertisement -

చాలా రోజుల గ్యాప్ తరువాత నారా రోహిత్‌ నటిస్తున్న చిత్రం ‘ప్రతినిధి 2’. ఈ మూవీకి సీనియర్ జర్నలిస్టు మూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేశారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ప్రతినిధి 2’పై ఈ వీడియో ఆసక్తిని పెంచింది.

కాగా, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News