- Advertisement -
మన తెలంగాణ, హైదరాబాద్ : కూరలో కారం ఎక్కువైన, శరీరంపై ఉన్న గాయం మీద కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ స్వాజీకి 50 కిలోల కారంతో భక్తులు అభిషేకం చేశారు. సోమవారం ఎపిలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని దొరసానిపాడు గ్రామంలో ఈ వింత అభిషేకం ఘటన జరిగింది. ప్రత్యంగిరా మాత ఆవాహనంతో ఉన్న శివస్వామి అనే పూజారిని కూర్చోబెట్టి ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణతో ఆతని శరీరంపై కారాన్ని భక్తులు చల్లారు. దొరసానిపాడు గ్రామంలో శివదత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమం ఉంది. అక్కడ ఈ హోమాన్ని, పూజలను నిర్వహించారు.
- Advertisement -