Sunday, December 29, 2024

బిడ్డపోయిన బాధలో ఉన్నాం.. రాజకీయాలు చేయొద్దు: ప్రవళిక తల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిడ్డపోయిన బాధలో ఉన్నాం రాజకీయాలు చేయొద్దు అని ప్రవళిక తల్లి మర్రి విజయ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోవాలని ఆమె కోరింది. నా కుమారుడు, కుమారై రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రవళిక తల్లి పేర్కొంది. మేం కూలీ పనులు చేసుకుంటూ కష్టపడి కోచింగ్ ఇప్పించాం. ప్రవళికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువకుడి వేధింపులు తాళలేక నా కుమారై ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కారమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రవళిక తల్లి డిమాండ్ చేసింది. ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News