దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారత్‌కు 1915లో తిరిగి వచ్చిన సందర్భంగా నిర్వహిస్తుండే ‘ప్రవాసీ భారతీయ దివస్’ కార్యక్రమంలో ప్రధానులు విదేశాల్లోని భారత సంతతి వ్యక్తులు (పిఐఒలు), ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు)ను ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో వారిని భారతమాత రాయబారులని అభివర్ణించారు. వారు భారత సంస్కృతికి, నాగరికతకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. విదేశాల్లోని భారతీయులు ‘భారత దేశ దూతలు’ అని ప్రధాని నరేంద్ర మోడీ క్రితం నెల భువనేశ్వర్‌లో ప్రవాసీ భారతీయుల సమావేశంలో చెప్పారు.యునైటెడ్ స్టేట్స్ (యుఎస్)లో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణకు గురైన, స్వదేశానికి తిరుగు ప్రయాణం కావలసి వచ్చిన, యుఎస్ సైనిక విమానంలో పంపిన భారత వలసవాదులు మరొక విధంగా రాయబారులు. భారత ప్రతిభ, వ్యాపారం, సంస్కృతి లేదా నాగరికత గురించి కాకుండా అవకాశాల లేమి, ఏదో విధమైన వివక్షకు గురికావడం, దేశంలో నివసించలేక అక్రమ వలస ఇక్కట్లకు లోనుకావడం గురించి ప్రపంచానికి వారు గుర్తు చేస్తుంటారు.
మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకోసం వారి ఆందోళన కారణంగాను, విదేశాల్లో భారతీయ శ్రామికులకు అధ్వాన చెల్లింపుల దుస్థితి దృష్టాను ఐరోపా కాలనీలకు భారతీయ శ్రామికుల నిర్బంధ తరలింపుపై జాతీయోద్యమ నాయకత్వం సరైన దృష్టి పెట్టకపోవడం భారతమాత ముఖంపై నల్లని మచ్చ. జాతీయవాద నాయకత్వం నుంచి ఒత్తిడితో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1915 లో లండన్‌లో సామ్రాజ్యవాద ప్రభుత్వానికి ఒక వినతిపత్రం అందజేసింది: ‘కాంట్రాక్ట్ కూలీల వలస వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనం ఏమేరకు ఉన్నప్పటికీ, ఆ ప్రశ్న రాజకీయ అంశం ఏమిటం భారత్‌లో బ్రిటిష్ పాలన శ్రేయస్సు తమ మనస్సులో ఉన్నవారు ఎవరైనా దానిని అలక్షం చేయజాలరు.. మధ్యేవాదం, తీవ్ర దృక్పథం ఉన్న భారతీయ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ ఉనికిని బానిసత్వంగా పేర్కొనడానికి వెనుకాడరు.
బ్రిటిష వలసవాద సామ్రాజ్యం దృష్టిలో వారి మొత్తం జాతికి బానిస ముద్ర వేస్తారు.’ ఇప్పటి అక్రమ వలసదారుల ప్రతిపత్తి అనేక విధాలుగా 19వ, 20వ శతాబ్దాల కాంట్రాక్ట్ కూలీలకు భిన్నమైనది ఏమీ కాదు. 20వ శతాబ్దపు కాంట్రాక్ట్ కూలీల మునిమనవళ్లు, మనవరాళ్లను భారత మాత విదేశీ ప్రతినిధులుగా భారత్‌లో ఇప్పుడు సన్మానించవచ్చు, కానీ, ఇప్పుడు అక్రమంగా వలస వెళుతున్న భారత మాత పిల్లలు అనేక మంది బ్రిటిష్ ఇండియా నిరుపేదలను బానిసలుగా మార్చినవారి కన్నా భిన్నమైనవారు ఏమీ కాదు. చట్టబద్ధమైన వలసదారులను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదకారులుగా స్వాగతిస్తున్నారు. వారు తమతో మానవ వనరులు లేదా ఆర్థిక మూలధనం తీసుకువస్తుంటారు కనుక వారిని స్వాగతిస్తున్నారు. అక్రమ వలసదారులకు ఆఫర్ చేసేందుకు వారి వేతన కూలీ మాత్రమే ఉంటుంది. వారిద్దరికీ ఆతిథ్య ఆర్థిక వ్యవస్థకు సమకూర్చే సత్తా ఉంటుంది. వారిద్దరు స్థానికులనుంచి ఉద్యోగాలను లాక్కోగలరు. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు చట్టబద్ధమైన వలసను, అక్రమ వలసను వేర్వేరుగా పరిగణిస్తుంటాయి.
జనాభా శాస్త్రాలు సాంఘిక దృక్పథాల పాత్రనే పోషిస్తుంటాయి. మరొక వైపు అక్రమ వలసదారులను ఆతిథ్య దేశం, స్వదేశం రెండింటిలో హీనంగా పరిగణిస్తుంటారు. ఆతిథ్య దేశంలో వారిని సంపదగా కాకుండా, ఒక రుణభారంగా చూస్తుంటారు. స్వదేశంలో వారిని సిగ్గుమాలినవారిగా చూస్తుంటారు, వారు దేశానికి అపఖ్యాతి తెచ్చేవారిగా భావించడం అందుకు కారణం. యుఎస్ అధికారులు అక్రమ వలసదారులుగా గుర్తించినవారి సంఖ్యపైన, తిరిగి పంపినవారి సంఖ్యపైన ప్రస్తుతం మీడియా దృష్టి కేంద్రీకరించింది. గత కొవిడ్ అనంతర ఐదు సంవత్సరాల్లో యుఎస్ కస్టమ్స్, సరిహద్దు రక్షణ సంస్థ అక్రమంగా యుఎస్‌లోకి ప్రవేశించే యత్నం చేసిన లక్షా 70 వేల మంది భారతీయ వలసదారులను నిర్బంధించింది.
ఈ సందర్భంగా ఆసక్తికరమైనది ఏమిటంటే, అటువంటి అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు బాగా అభివృద్ధి చెందిన గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో విదేశాల్లో గుజరాతీలు, పంజాబీలు ఉండడం బంధుత్వాల సాయంతో వలస వెళ్లాలనే మోజుకు, అక్కడ జయప్రదం కావచ్చనే ఆశ ఒక కారణంగా ఉంటున్నది. అయితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తగిన అవకాశాలు లేకపోవడం కూడా అక్రమ వలసదారుల తెగింపునకు దోహదం చేస్తోంది.
అక్రమ వలసదారులను బలవంతంగా తిప్పి పంపించిన వార్త భారతీయుల వలసకు గల ద్వంద్వత్వాన్ని సూచిస్తున్నది. భారత ప్రతిభావంతులను, సంపన్నులను ప్రపంచవ్యాప్తంగా స్వాగతిస్తున్నారు, వారు ఆనందంగా దేశం వీడి వెళుతున్నారు. అయితే, భారత్‌లో ఒత్తిడికి లోనవుతున్నవారిని, తెగిస్తున్నవారిని అంతకంతకు నిరాకరిస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ అంతరం చూపుతున్నారు. భారత్‌లో తెగిస్తున్నవారికి ద్వారాలు మూసివేస్తూ, ప్రతిభావంతులకు బాహాటంగా అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఒక వైపు దిక్కుతోచనివారి అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరొక వైపు సంపన్నులు అధిక సంఖ్యలో విలాస జీవనం అన్వేషణలో భారత్‌ను వీడి వెళుతున్నారు. ‘మదుపు ద్వారా’ నివాసాన్ని, విదేశీ పౌరసత్వాన్ని సంపాదించే క్లయింట్లకు సాయం చేసే ‘ప్రపంచ పౌరుల సంస్థ’గా తనను అభివర్ణించుకునే సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ 2022లో 6500 మంది సంపన్న భారతీయులు, 2024లో 4300 మంది వేతనం లభించే వలసను కోరుకున్నారని వెల్లడించింది.
అభివృద్ధి చెందిన అనేక ఆర్థిక వ్యవస్థలు ఒక ధరకు పౌరసత్వాన్ని ఇవ్వజూపుతున్నాయి. అంతకంతకు అధిక సంఖ్యలో భారతీయులు ఆ ధర చెల్లించేందుకు సుముఖంగా ఉంటున్నారు. 2024 ఆగస్టులో పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానం ఇస్తూ, 2,25,260 మంది భారతీయులు 2022 లోను, 2,16,219 మంది 2023లోను ‘తమ భారతీయ పౌరసత్వాన్ని త్యజించారు’ అని వెల్లడించారు. మొత్తంగా 18,80,559 మంది భారతీయులు 2011 -23 కాలంలో తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఇక చివరగా చూస్తే, సహజ పరిణామంగా ఉన్న సీమాంతర వలసను 20వ శతాబ్దంలో మాత్రమే చట్టవిరుద్ధమైనదిగా పరిగణించారు. జీవనోపాధి, అవకాశాల అన్వేషణలో మనుషులు కాలక్రమేణా తరలివెళ్లారు. ‘శ్వేతజాతి అమెరికన్’ జనాభాలో అత్యధిక భాగం యూరప్ నిరుపేదలు, నిరాశాజీవులతో కూడుకున్నదే కానీ యూరోపియన్ ఉన్నత వర్గాలు కాదు. యుఎస్‌కు యూరోపియన్ ఉన్నత వర్గాల వలస 20వ శతాబ్దపు పరిణామం. అది యుద్ధాల మధ్య కాలంలో మొదలై, ఆ తరువాత పెరిగింది. అట్లాంటిక్ మీదుగా నౌకల్లో దాటి యుఎస్‌లోకి ప్రవేశించినవారు యూరప్ బడుగు వర్గాలు, నిరాశాజీవులు. మెరుగైన, స్వేచ్ఛాయుత జీవితం కోరుకుంటున్న అటువంటి వ్యక్తులకు ద్వారాలు తెరచిన అమెరికా ఇప్పుడు ప్రపంచంలోని బడుగు వర్గాల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నది.
స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఈ ‘అక్రమ’ వలసదారులు తాము నిరాశతో వదలివెళ్లిన సమాజాన్ని ఎలా చూస్తారు? ‘అవకాశవాద భూమి’కి వెళ్లి, నామమాత్ర అవకాశాలు కల్పిస్తున్న ప్రదేశానికి తిరిగి రావలసివచ్చిన వారికి జీవితం ఏవిధంగా ఉండబోతోంది? తిరిగి వచ్చినవారి పట్ల, వెనుకకు పంపినవారి పట్ల మనం ఏవిధంగా స్పందిస్తాం? పిఐఒ, ఎన్‌ఆర్‌ఐ, రిసి సునాక్‌లు, సత్య నాదెళ్లలు, అజయ్ బంగాలకు ఎంతో గౌరవంగా, ఆడంబరంగా స్వదేశంలో స్వాగతం లభించిం ది. ఇతర ప్రవాసులను మనం ఎలా స్వీకరించాలి?
సంజయ్ బారు