Wednesday, December 25, 2024

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి..

- Advertisement -
- Advertisement -

అమెరికాలో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి మరణించాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి తెలంగాణ వాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో గత కొంతకాలంగా టీచర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడి ప్రవీణ్ చనిపోయినట్లు సమాచారం. అతని మరణ వార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహకరించి ఆదుకోవాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News