Monday, January 20, 2025

సౌత్ వర్సెస్ నార్త్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు ఉత్తర, దక్షిణ సరిహద్దు రేఖ నిర్థిష్టం మరింత స్పష్టం అవుతోందని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి ఆదివారం వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దశలో చక్రవర్తి స్పందన వివాదానికి దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ఇది రెండో విజయం. ఈ పరిణామంతో ఇక బిజెపి ఈ ప్రాంతంలో అధికారంలో లేకుండా పోయింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో వివాదం అయ్యాయి. దీనితో చక్రవర్తి సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి తమ స్పందనను తొలిగించారు.

కాంగ్రెస్ పార్టీ సంకుచిత, విభజిత, విద్వేషభరిత రాజకీయాలు చక్రవర్తి ఆలోచనలతో ప్రతిఫలించాయని బిజెపి నేతలు విమర్శించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు దిగిన చక్రవర్తి కాంగ్రెస్‌లో ప్రొఫెషనల్స్ ఛైర్మన్‌గా, డాటా అనాలిటిక్ సారధిగా ఉన్నారు. ఎక్స్ సోషల్ మీడియాలో ఆయన సౌత్ వర్సెస్ నార్త్ అని పేర్కొనడం తీవ్ర విషయం అని బిజెపి మండిపడింది. ఇప్పటి ఫలితాలపై కాంగ్రెస్ ఎంపి కీర్తి చిదంబరం స్పందిస్తూ కేవలం ‘ ది సౌత్’ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News