Thursday, January 23, 2025

పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ప్రవీణ్ రాసలీలలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో న్యూడ్‌కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిన ట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్‌సి గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాది 12 సెలవులు పెట్టింది. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని సెలవు పెట్టింది.

ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెడుతోంది. మరోవైపు పేపర్ లీక్‌కు సూత్రధారిగా రాజశేఖర్‌ను పోలీసులు తేల్చారు. ప్రవీణ్ ద్వారా పేపర్‌ను రాజశేఖర్ బయటికి తెప్పించాడు. టిఎస్‌పిఎస్‌సిలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్‌ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News