Monday, January 20, 2025

సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ బాధ్యతల స్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో ఉంటారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన సుబోధ్‌కుమార్ జైశ్వాల్ ప్రధాన కార్యాలయంలో తన బాధ్యతలను ప్రవీణ్ సూద్‌కు అప్పగించారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ కర్ణాటక క్యాడర్ అధికారి.

నిన్నటివరకు ఆ రాష్ట్ర డిజిపిగా సేవలందించారు. ప్రధాని నరేంద్రమోడీ, సిజెఐ డివై చంద్రచూడ్, లోక్‌సభలో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన అత్యున్నత అధికార కమిటీ ప్రవీణ్ సూద్ పేరును ప్రతిపాదించారు. కాంగ్రెస్ నేత చౌదరి మాత్రం ఈ ప్రతిపాదనకు అసమ్మతి తెలిపారు. ప్రవీణ్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివిన తరువాత యుపిఎస్‌సి ద్వారా ఐపిఎస్ సర్వీస్ లోకి వచ్చారు. కర్ణాటక పోలీస్ శాఖలో అనేక ఉన్నత పదవులు పొందారు. అనేక విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News