Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి ట్యాంక్‌లో పడేశాడు….

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియుడు ప్రియురాలిని చంపి సెప్టింక్ ట్యాంక్‌లో దాచిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యమునాపార్ కర్చానా ప్రాంతంలో అరవింద్ అనే వ్యక్తికి రాజ్ కేసరి అనే ప్రియురాలు ఉంది. అరవింద్ తన ప్రియారాలిని చంపాడు. అనంతరం మృతదేహాన్ని తాను నిర్మిస్తున్న భవనంలోని ట్యాంక్‌లో దాచిపెట్టాడు. రాజ్ కేసరి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా అరవింద్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే మృతదేహాన్ని ట్యాంక్‌లో నుంచి బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: ధరల అదుపు ఎప్పుడు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News